May 15, 2026

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన NSUI నాయకుడు ప్రేమ్ కుమార్

IMG-20260326-WA0009
సంకల్పం పెద్దేముల్, మార్చి 26 : పెద్దేముల్ మండల పరిధిలోని రామ్ సింగ్ తండా ప్రభుత్వ పాఠశాలను గురువారం తాండూరు నియోజకవర్గ NSUI నాయకుడు ప్రేమ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వం పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాఠశాలలో భోజనం నాణ్యతను పరిశీలించిన ఆయన, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకున్నారు. విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు NSUI కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.