November 3, 2026

యువకులు క్రీడల్లో రాణించాలి… జాతీయస్థాయిలో ప్రతిభను చాటాలి …. ఆర్ బి ఓ ఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

IMG-20260325-WA0381

యువత క్రీడల్లో రాణించాలని… జాతీయ స్థాయిలో ప్రతిభను చూపాలని RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు అజయ్ ప్రసాద్ గారి తండ్రి కిషన్ ప్రసాద్ గారి జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొన్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గారు విజేతలకు మరియు క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు మరియు బహుమతులు అందజేశారు, ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ యువకులు వాలీబాల్ లో అద్భుత ఆటతీరు కనబరిచారు అని, ఇలాగే క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని,జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రతిభను ప్రదర్శించడానికి తాను ఎల్లవేళలా ప్రోత్సహిస్తానని, అజయ్ ప్రసాద్ గారు తన తండ్రి గారి పేరిట ఈ క్రీడా నిర్వహించి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని నింపారని,యువత స్మార్ట్ ఫోన్లు విడిచి క్రీడల వైపు ఆసక్తి చూపి శారీరిక ధారుడ్యానికి ప్రాధాన్యం ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలి,భవిష్యత్తులో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించి గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్నీ వెలికి తీస్తామని వారు అన్నారు.