July 31, 2026

త్వరలో హోం మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్…..? రాష్ట్రస్థాయిలో కొనసాగుతున్న చర్చ…!

WhatsApp Image 2026-04-09 at 11.46.50 PM

తెలంగాణ రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా కొనసాగుతున్న తాండూర్ ముద్దుబిడ్డ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో హోం శాఖ దక్కే అవకాశం ఉన్నట్లు  విశ్వసనీయ  సమాచారం. ప్రస్తుత  బాధ్యతలపై ఆయన అంతగా ఆసక్తి చూపడం లేదని, సామాజిక సమీకరణాల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో హోం మంత్రి పదవికి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో  వెలువడనుందని వినికిడి.