May 15, 2026

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పై చర్యలు తీసుకోవాలంటూ తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో బిజెపి నాయకుల ఫిర్యాదు

WhatsApp Image 2026-04-09 at 11.15.41 PM

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పై చర్యలు తీసుకోవాలంటే బిజెపి తాండూరు పట్టణ అధ్యక్షులు,  కౌన్సిలర్ నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు పట్టణ  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.   ఆర్ఎస్ఎస్ బిజెపి పార్టీని ఉద్దేశించి  మల్లికార్జున్ ఖర్గే  మాట్లాడిన వివాదాస్పద  వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ఆయన పై చర్యలు తీసుకోవాలంటూ  తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ కు ఫిర్యాదు చేశారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర మహిళా  నాయకురాలు సాహూ శ్రీలత, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, భద్రేశ్వర్,  కౌన్సిలర్లు అంతారం కిరణ్.  శ్రీకాంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, దోమ కృష్ణ, సంగమేశ్వర్, ఇందూరు రాములు, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.