29న డీసెట్ ఫేజ్-3 స్పాట్ అడ్మిషన్లకు ఆహ్వానం
డీ సెట్ 2026–28 బ్యాచ్ ప్రవేశాల కోసం ప్రభుత్వ డైట్ కళాశాలలో ఫేజ్-3 స్పాట్-2 అడ్మిషన్లను ఈ నెల జూలై 29న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఘనీ తెలిపారు. ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు జూలై 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.అలాగే ప్రైవేట్ డీఈడీ కళాశాలల ఫేజ్-3 స్పాట్-2 అడ్మిషన్లు జూలై 30న నిర్వహించబడతాయని, అదే సమయాల్లో సర్టిఫికెట్ల పరిశీలన, సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అవసరమైన జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇతర వివరాలకు 7780740880 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని అబ్దుల్ గాని కోరారు.
