తెలంగాణ ఉద్యమకారుడు ప్రకాష్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు
తెలంగాణ ఉద్యమకారుడు ప్రకాశ్ గౌడ్ మరియు హాజీపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ జన్మదినాన్ని సందర్భంగా హాజీపూర్ నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న స్నేహితులు, నాయకులు ఇద్దరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. జన్మదినం సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలపరిచారు. ఈ కార్యక్రమంలో అక్బర్ బాబా, ఎంఆర్పీఎస్ నాయకుడు ఆనంద్, యువ నాయకులు గాజుల మన్నన్, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కలాల్ చంద్రశేఖర్ గౌడ్, బీసీ సంఘం యాలాల మండల నాయకులు లక్ష్మణ చారి, మెట్లీ కృష్ణ, లాలూ ముదిరాజ్ తదితరులు పాల్గొని ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్‌లకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాల్లో ముందుండే నాయకులుగా ఇద్దరూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం అందరూ కలిసి కేక్ పంచుకుని స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
