September 19, 2026

కట్ట మైసమ్మ ఆశీస్సులు తాండూరు ప్రజలపై ఉండాలి…. మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి

IMG_20260217_134713566_HDR

కట్ట మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు తాండూరు పట్టణ ప్రజలపై ఉండాలని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూర్ పట్టణంలోని ఆదర్శనగర్, పాత కుంటలో వెలసిన  కట్ట మైసమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున ఇక్కడ నిర్వాహకులు  అన్నదానం నిర్వహించడం గొప్ప విషయం అని, తాండూరు పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేపడతానని అన్నారు. దేవాలయ నిర్వాహకులు చైర్మన్, కౌన్సిలర్ సురేష్ నాయక్, దివిటి ఎల్లప్పను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, డైరెక్టర్ ఉదయభాస్కర్ రెడ్డి,  దేవాలయం నిర్వాహకులు ప్రకాష్, ఆంజనేయులు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు