September 19, 2026

రైతులు ఆధునికపద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి అభివృద్ధి చెందాలి….. సబ్సిడీ స్ప్రింక్లర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

WhatsApp Image 2026-03-09 at 6.53.17 PM

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అందుకే రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.  సోమవారం తాండూరు  మండలం అంతారం రైతు వేదికలో  ప్రభుత్వం ద్వారా మంజూరైన 108 సబ్సిడీ  స్ప్రింక్లర్ సెట్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి అభివృద్ధి చెందాలని అన్నారు.  రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని రైతు శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.  రైతులు  స్ప్రింక్లర్ల ద్వారా  వ్యవసాయం చేస్తే  సాగు నీటి ఆదా మరియు పంట దిగుబడి పెరుగుతుందని అన్నారు.  అలాగే రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలని  కోరారు. అదేవిధంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసర్చ్  అందించిన విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు ఉచితంగా అందజేశారు.  ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, ఆత్మ చైర్మన్ శంకర్ రెడ్డి, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, కోటిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, అంతారావు సర్పంచ్ లక్ష్మమ్మ, డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, సురేందర్ రెడ్డి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్  వడ్డే శ్రీనివాస్,  హార్టికల్చర్ అధికారి కమల, సెరికల్చర్ అధికారి విజయకుమార్, హెచ్ఈఓ రాజు, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.