జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ వేధింపులు…. ఆవేదనకులోనఅవుతున్న సిబ్బంది
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ వేధింపులు
…. ఆవేదనకులోనఅవుతున్న సిబ్బంది….
….. ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన సిబ్బంది
తాండూర్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సూపరిండెంట్ వేధింపులకు గురి చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా సవ్యంగా ఉన్న తమను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కి అక్కడి నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు వినికిడి. ఎన్నికల అనంతరం సూపరిండెంట్ ను పిలిచి మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరిని తనకు అనుకువగా మార్చుకొని ఇతరులపై జులం చేస్తున్నారని వినికిడి. ప్రభుత్వ నిబంధన ప్రకారం నర్సింగ్ సిబ్బంది డ్యూటీ రోస్టర్ తయారు చేయడం మరియు వార్డుల కేటాయింపు చేయడం నర్సింగ్ సూపర్డెంట్ బాధ్యత కానీ ప్రస్తుత మెడికల్ సూపర్నెంట్ అన్ని విషయాల్లో తరచు జోక్యం చేసుకొని డ్యూటీ రోస్టర్ ను తన ఇష్టానుసారం మారుస్తున్నారని, దీంతో పని నిర్వహణలో ఇబ్బంది పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి షిఫ్టులలో ఇద్దరూ హెడ్ నర్సులు తప్పనిసరిగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కొందరితో చనువుగా ఉంటూ ఇంకొందరుని ఇబ్బందుల గురి చేస్తున్నారని సిబ్బంది ఆవేదనకు లోనవుతున్నారు. మెడికల్ సూపర్నెంట్ నర్సింగ్ సిబ్బందిని అవమానానికి గురి చేస్తున్నారని, దురుసు మాటలాడుతూ, చులకనగా చూస్తున్నారని దీంతో కొందరు సిబ్బంది మానసిక ఆవేదనకు లోనయ్యారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ సూపర్నెంట్ ను వెంటనే మార్చాలని లేదంటే తమ విధులు నిర్వహించమని కొందరు సిబ్బంది భీష్మించుకుని కూర్చున్నారు. పై అధికారులకు నర్సింగ్ సిబ్బంది తదితరులు ఫిర్యాదు కూడా చేసినట్లు వినికిడి. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిసి సూపరిండెంట్ చేస్తున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేయనున్నారు. మెడికల్ సూపరిండెంట్ కొందరితో ‘నన్ను ఒక సైడే చూశారు ఇంకో సైడ్ చూడలేరు’ ‘నేను చెప్పినట్లే వినాలి… లేదంటే మూడో కన్ను తెరుస్తా’ నా నిజ స్వరూపం మీకు తెలియదు… మీ సర్వీస్ బుక్కులు నా దగ్గరే ఉన్నాయి …ఏం చేస్తానో మీకు తెలియదు’ అంటూ వేధిస్తున్నారని సిబ్బంది పై అధికారుల ముందు మొరపెట్టుకున్నారని వినికిడి. ఎమ్మెల్యే గారు ఈ సూపరిండెంట్ ను మారుస్తారా లేదా…మేం డ్యూటీ చేయలేకపోతున్నామంటూ…విసిగిపోతున్నాం… అంటూ కొందరు సిబ్బంది ఎమ్మెల్యేకు తెలుపనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
