July 30, 2026

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిపై సూపరిండెంట్ వేధింపులు అనే వార్తకు స్పందన

IMG-20260310-WA0892(1)

…. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది

…. అలా ప్రవర్తిస్తే సస్పెండ్ చేయిస్తా అని ఘాటుగా హెచ్చరించిన ఎమ్మెల్యే

……నూతన సూపరిండెంట్ గా తిరిగి మూర్తి నియామకం

………. త్వరలో ఆదేశాలు జారి కానున్నట్లు సమాచారం

గత కొన్ని రోజులుగా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ండెంట్ ఆస్పత్రి సిబ్బందిని వేధిస్తున్నారనే వార్త సోమవారం ‘సంకల్పం’లో వచ్చిన వార్తకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి సిబ్బంది ఎమ్మెల్యేలు కలిసి ఆస్పత్రి సూపర్డెంట్ వేధిస్తున్న విషయాన్ని విన్నవించారు. తనకు అలుకువగా ఉన్న వారిని కొందరిని చేరదీసి మిగతా అందరిని వేధిస్తున్నారని… వేధింపులకు గురైన వారు ఎమ్మెల్యేకు అన్ని విషయాలు చెప్పినట్లు వినికిడి. తాము ఎమ్మెల్యే కు వేధింపుల విషయాన్ని తెలిపితే ఏం చేస్తారో అని భయపడుకుంటానే అన్ని విషయాలు ఎమ్మెల్యేకు తెలిపారు. జిల్లా ఆస్పత్రి, ఎంసిహెచ్ సిబ్బంది చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూపర్డెంట్ పై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం…వెంటనే ప్రస్తుతం ఉన్న మెడికల్ సూపర్డెంట్ స్థానంలో ఇదివరకు సూపర్డెంట్ గా పని చేసిన మూర్తిని తిరిగి నియమించాలని పై అధికారులను ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో ప్రస్తుతం ఉన్న సూపర్డెంట్ ను తొలగించి ఆయన స్థానంలో సూపర్డెంట్ గా మూర్తిని నియమించేందుకు ఆదేశాలు జారీ కానున్నాయని విశ్వసనీయ సమాచారం

.