May 15, 2026

యాలాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ చరణ్ పై నిరాధారమైన ఆరోపణలు తగవు… మాజీ సర్పంచ్ మిత్రు నాయక్

WhatsApp Image 2026-04-14 at 10.52.32 PM

యలల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ వేధింపులకు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పలు సామాజిక మాధ్యమాలలో ఛానల్లలో ప్రసారం అయిన విషయం తెలిసిందే.   కాగా ఇదే విషయంలో యాలాల మండలం బషీర్ మియా తాండ మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ మాట్లాడుతూ  యాలాల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ చరణ్ ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని.  కొన్ని సామాజిక మాధ్యమాలు చానల్లో శివ చరణ్ కోకట్ గ్రామంలో SIR  లో భాగంగా  ఎలక్ట్రోలర్ మ్యాపింగ్ కోసం వెళ్ళిన ఫోటోలను పెట్టి,  అన్న సాగర్ గ్రామానికి చెందిన కవిత ఇంటికి వెళ్లినట్లు వేధించినట్లు సృష్టించి,  నిజాయితీగా  విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే  రెవిన్ ఇన్స్పెక్టర్ శివ చరణ్ పై అనవసర ఆరోపణలు చేశారని,  అనుమతులు తీసుకొని ఎర్రమట్టి రవాణా చేయాలని అన్నందుకు ఆయనపై అనవసరంగా  పాత కక్షతో వేధింపులకు గురి చేశారని మిత్రు నాయక్  ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని,  కోకట్ గ్రామానికి వెళ్ళినప్పుడు ఉన్న దుస్తులు,  అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నప్పుడు ఉన్న దుస్తులు కూడా వేరుగా ఉన్నాయని ఒకసారి గమనించాలని మిత్రు నాయక్ అన్నారు.  యాలాల్ మండల రెవెన్యూ అధికారులు తమ విధుల  విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తే వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ  ఆర్ఐ వేధింపులకు ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం అన్యాయమని అన్నారు.  ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేసే సామాజిక మాధ్యమాలు,  ఛానల్ పై త్వరలో  ఫిర్యాదు చేయనున్నానని మిత్రు  నాయక్  తెలిపారు.  ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్  శివ చరణ్  పై అనవసర ఆరోపణలు చేస్తే  చర్యలు తప్పవని మిత్రు నాయక్ హెచ్చరించారు. పాత ఫోటోలు పెట్టి వార్తలు ప్రసారం చేస్తే వారిపై  త్వరలో ఫిర్యాదులు చేయనున్నామని  వారి పై చర్యలు తప్పవని  మిత్రు నాయక్  హెచ్చరించారు. యాలాల మండల రెవెన్యూ అధికారి,  రెవెన్యూ ఇన్స్పెక్టర్ తమ  విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని వారి కోసం తాను ఎలాంటి చర్యల కైనా సిద్ధమవుతానని మిత్రు నాయక్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని తరలించే వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారని,  విధులపై నిక్కచ్చిగా వ్యవహరించిన శివ చరణ్ పై కట్టుకథలు మానాలని,  ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నానని మిత్రు నాయక్ హెచ్చరించారు.