అక్రమ ఎర్రమట్టిని ఆపండి… ఎమ్మార్వో తో బిఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి
అక్రమ ఎర్రమట్టి తరలింపు వెంటనే ఆపివేయాలని యాలాల మండల బిఆర్ఎస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం యాలాల మండల కేంద్రంలో ఎమ్మార్వో వెంకట స్వామిని కలిసి అందుకు సంబంధించిన వీడియోలను ఎమ్మార్వోకు చూయించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యాలల మండలం పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామ శివారులో ఎర్రమట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ భూములే ఆధారంగా చేసుకుని రెవెన్యూ మైన్స్ పోలీస్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నారని అన్నారు. అక్రమ ఎర్రమట్టి తరలింపు విషయంపై రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే అనుమతులు ఇవ్వలేమని చెప్తూనే కాలయాపన చేస్తున్నారని, నిరుపేదలు ఇండ్ల నిర్మాణానికి ఎర్రమట్టి తెచ్చుకుంటే అధికారులు తక్షణమే వాహనాల పై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు అక్రమ ఎర్రమట్టి మాఫియాకు మంచి సంబంధాలు ఉన్నాయని రవీందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో యాలాల మండల రెవెన్యూ అధికారిని కలిసి అక్రమ ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాల విషయంలో ఫిర్యాదు చేయగా కొడంగల్ రోడ్డులో వాహనాలను నిలిపివేశారు. ఇదే విషయంలో తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎర్రమట్టి తరలింపు పై అనుమతుల విషయంలో అధికారులను ఆరా తీయగా ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. దీంతో యాలాల్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
