September 19, 2026

యువకులు క్రీడల్లో రాణించాలి……. సిటీ కేబుల్ ఇన్చార్జ్ మఠం నిరంజన్

01

యువకులు క్రీడల్లో రాణించాలని సిటీ కేబుల్ ఇన్చార్జ్  మఠం  నిరంజన్ అన్నారు.  తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ఆయన పాల్గొన్నారు.  మొదటి మరియు  క్రికెట్ టోర్నమెంట్లో  రెండవ స్థానంలో గెలుపొందిన  విజేతలకు బహుమతులను అందజేశారు.  ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఇన్చార్జ్  మఠం  నిరంజన్ మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని,  మండల జిల్లా స్థాయికి ఎదగాలని అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.  రానున్న రోజులో గ్రామంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో క్రీడాకారులు  లేవిడి మహేష్,  తలరి గోవింద్, హోటల్ మల్లేశం, వడ్ల నరసింహులు  తదితరులు పాల్గొన్నారు.