September 19, 2026

కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తాండూరు మండల బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్

ChatGPT Image Jul 25, 2026, 12_31_58 AM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తాండూరు మండల బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ ఆయనకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.శుక్రవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి చేరుకున్న ఆర్సీ గౌడ్, ఆయనను కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేటీఆర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కేటీఆర్, ఆర్సీ గౌడ్‌తో మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్సీ గౌడ్ యువసేన సభ్యులు బోయిని జగదీష్, జట్టూరు కాసిన, బాలకృష్ణ, తాండూరు మండల బీఆర్ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీ గౌడ్, పార్టీ కోసం మరింత ఉత్సాహంగా పనిచేస్తామని తెలిపారు.