ATM తరహా స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. తెలంగాణలో త్వరలో పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)లో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దకాలంగా వినియోగంలో ఉన్న పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు తరహా పీవీసీ (PVC) స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై కుటుంబ యజమాని ఫోటో, క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉండనున్నాయి. వీటి ద్వారా లబ్ధిదారుల వివరాలను సులభంగా ధృవీకరించడంతో పాటు నకిలీ కార్డులు, అక్రమ వినియోగాన్ని నివారించే అవకాశం ఉంటుంది.ప్రభుత్వం ముద్రించిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లా పౌరసరఫరాల కార్యాలయాలకు చేరుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలు విడుదల చేసిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.ఈ స్మార్ట్ కార్డుల అమలుతో రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారడంతో పాటు లబ్ధిదారులకు వేగవంతమైన సేవలు అందే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
