September 18, 2026

తాండూర్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ChatGPT Image Aug 5, 2026, 09_54_46 PM

ఎమ్మెల్యే  బుయ్యని మనోహర్ రెడ్డి  జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా  జరిగాయి.  బుధవారం తాండూర్  కిరాణా మర్చంట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, బి-బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్‌శెట్టి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక  సేవాభావాన్ని ప్రతిబింబించాయి.  ఎమ్మెల్యే జన్మదినోత్సవంలో భాగంగా పట్టణంలోని వివిధ దేవాలయాల్లో ఎమ్మెల్యే అభిమానులు, స్నేహితులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ నగరేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి తనయులు శివారెడ్డి, అవినాష్ రెడ్డి సమక్షంలో శ్రీ నగరేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చనలు నిర్వహించి, ఎమ్మెల్యే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులు, ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా  వైట్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రక్తదానం వంటి మహత్తర సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు కటకం వీరేందర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట మురళీకృష్ణ, కార్యదర్శి కొట్రిక కిరణ్ కుమార్, యువజన సంఘం అధ్యక్షుడు తర్లపల్లి భాను కుమార్, కార్యదర్శి పునీత్ కుమార్, కోశాధికారి కల్వరాజ్ వంశీ, కిరాణా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొట్రిక నాగరాజు, ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు దేవగిరి రమేష్, కలువ శేషాద్రి, యువజన సంఘ కార్యవర్గ సభ్యులు, కిరాణా అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ వ్యాపారులు, గంజ్ వ్యాపారులు, పట్టణ ప్రముఖులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.