August 2, 2026

రోజుకు 20,000 ఇవ్వాల్సిందే లేదంటే ఓడిపోతావ్…. సీనియర్ నాయకుల హెచ్చరిక

Screenshot_20260206-093336_Google

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. దీన్ని ఆశగా చేసుకొని కొంత మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొన్ని పదవులు అనుభవిస్తూనే బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మీరు గెలవాలంటే మేము ప్రచారం చేయవలసిందే మేము ప్రచారం చేయాలంటే రోజుకు 20వేల రూపాయలు చెల్లించవలసిందే అని ఓ ముగ్గురు నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలని ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు సీనియర్ నాయకులకు రోజుకు 20 వేల రూపాయల డబ్బులు చెల్లిస్తున్నారని వినికిడి. డబ్బులు ఇవ్వకపోతే మీ ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్ అభ్యర్థి గెలిచేలా ప్రచారం చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని వినికిడి. ప్రజల మధ్యలో ఉంటూ ఎంతో హుందాగా ఉండవలసిన నాయకులు డబ్బులు డిమాండ్ చేయడం పట్ల కౌన్సిలర్ అభ్యర్థులు లోలోన తిట్టుకుంటున్నారు. ఎన్నికల్లో నువ్వు బరిలో ఉంటే గెలిపిస్తామన్న నాయకులు ఇలా అనడం పట్ల కౌన్సిలర్ అభ్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామని బరిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇతర కార్యకర్తలను ముందు తెలుపుతున్నారు.