వికారాబాద్ జిల్లాలో నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది…. ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు
వికారాబాద్ జిల్లాలో నాలుగు చైర్మన్ స్థానలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూర్ మున్సిపల్ పరిధిలోని పాత తాండూర్, గాంధీ చౌక్ స్ర్టీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి,డీసీసీ అధ్యక్షులు ధారసింగ్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ మీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విద్యవంతులకు, యువకులకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికీ పార్టీ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. సామాజిక న్యాయం పాటిస్తూ బీసిలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పాత తాండూర్ కొత్త తాండూర్ కాబోతున్నదని అన్నారు. గత రెండేళ్ళ పాలనలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏదో ఒక సంక్షేమ పథకం అందించడం జరిగిందన్నారు. గతంలో కరెంటు చార్జీలు పెరిగితే రోడ్లపై ధర్నాలు చేస్తే మన ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో దాదాపు 50 వేల పైగ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, త్వరలో ప్రభుత్వ ఉద్యోగలకు నోటిఫికేషన్స్ విడుదల చేసామన్నారు.నూతన రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం పంపీణీ చేశామన్నారు. బీజేపీ – బిఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నేను మాటలు చెప్పను, శిలాఫలకాలు వేయను, పని చేసి చూయిస్తా అన్నారు. తాండూర్ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం పాటిస్తూ సీట్ల కేటాయింపు చేశామన్నారు. సాంప్రదాయ రాజకీయాలకు చెక్ పెడుతూ కొత్తవారికి అవకాశం ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో ఉన్న అభ్యర్థులకు మీ ఇంటి బిడ్డగా భావించి ఓట్లు వేయాలన్నారు.
తాండూర్ మున్సిపల్ లో రెండేళ్ల పాలనలో దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చిలుక వాగు, గొల్లచెరువు, పాత తాండూర్ రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి అని అన్నారు. పాత తాండూర్ బ్రిడ్జి గత పాలకుల నిర్లక్ష్యంతో నష్టం ఎక్కువ జరుగుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తక్కువ మొత్తంలో నష్టం జరిగెట్లు డిజైన్ మార్చమని అన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లను కోల్పోయిన బాధితులందరికీ ప్రభుత్వపరంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు.
తాండూర్ పట్టణంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు కాగ్నా నది నుంచి మంచినీరు అందించడానికీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీఠ వేయడం జరిగిందని
తాండూర్ పట్టణంలో మహిళలకు దాదాపు రూ.15 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించడం జరిగిందని, గత రెండేళ్ళ పాలనలో మున్సిపల్ ను చక్కబెట్టడం జరిగిందని, మళ్ళీ దొంగల చేతికి అధికారం ఇస్తే మున్సిపల్ ను సర్వనాశనం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, పట్టణ నాయకులు, ఇంచార్జి లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
