ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “రైతు అవగాహన” కార్యక్రమం
ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు లంక నరసింహులు తెలిపారు. ఆదివారం తాండూరు మండలం జిన్గుర్తి శివారులోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం,జైవిక పురుగుల మందులు వాటి ప్రాముఖ్యత, స్థానికంగా లభించే మొక్కలతో జైవిక (బయో పెస్టిసైడ్స్) తయారీ విధానం, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలు, సమగ్ర కీటక సస్యరక్షణ పద్ధతులు మంచి వ్యవసాయ ఆచరణ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారని నరసింహులు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న పురుగు మరియు తెగుళ్ల సమస్యపై రైతులతో చేర్చించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక సురక్షితమైన స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించబడుతుంది. ఇతర వివరాలకు 9154795531,9154795528,8142745440,9550622252 సెల్ నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
