November 3, 2026

యాలాల్ మాజీ సర్పంచ్ పేరి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు

IMG-20260306-WA0310

యాలాల మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ కీర్తిశేషులు పేరి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు. శుక్రవారం వేసవిని దృష్టిలో ఉంచుకొని చదివేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు పేరి రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్లోళ్ల నరసింహులు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి యాలాల మండల కేంద్రానికి వచ్చే వారి సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిఎస్ శివయ్య, ఉప సర్పంచ్ శోభ నాగిరెడ్డి, యాలల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అక్బర్ బాబా, యాలల కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు రాపోలు నాగయ్య, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శేఖర్, నరసయ్య గౌడ్, ఉమేష్, ఏం సి డైరెక్టర్ గోనె శ్రీనివాస్, రాజు, యూత్ కాంగ్రెస్ యాలాల మండల అధ్యక్షులు అశోక్, హైమత్, మల్కయ్య, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు