వివిధ శాఖల అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై అవగాహన
ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కు సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, మను చౌదరి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, మల్కాజ్గిరి, సైబరాబాద్, మున్సిపల్ కమిషనర్ నా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి ప్రధాన సమస్యలపై చర్చించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు వస్తుందని స్పీకర్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు అధికారులు పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేయాలని స్పీకర్ కోరారు. శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 99 రోజులపాటు జరిగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పది అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల వద్దకే అధికారులు వెళ్ళనున్నారని అన్నారు. ఇప్పటికే నూతన రేషన్ కార్డులు, ఇంట్లో లేని నిరుపేదలందరికీ ఇళ్లని కేటాయించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారని అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవే చే దిశగా పనిచేస్తామని అన్నారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో అధికారులను సమన్వయం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతగిరి ఈకో పార్క్ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సాధిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు చెల్లింపులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గ్రామపంచాయతీలో నీటి కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 106 గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నాణ్యమైన భోజనాన్ని అందించే దిశగా పనిచేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, శంకరయ్య, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వివిధ శాఖల చైర్మన్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
