July 31, 2026

ఎమ్మెల్యే గారు నీ గెలుపుకు కారణమైన వారిని కూడా మోసం చేశావు…. మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్

WhatsApp Image 2026-03-05 at 9.42.54 PM

తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి ప్రమాణస్వీకారం జరిగిన రోజు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనవసర ఆరోపణలు చేశారని  బిఆర్ఎస్ నాయకులు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాండూరు పట్టణంలోని రాజు గౌడ్ తన నివాసంలో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి బరిలో ఉండేందుకు భయపడాలి  అన్న  వ్యాఖ్యను  రాజు గౌడ్ తీవ్రంగా ఖండించారు. భయం అనేది రోహిత్ రెడ్డి డిఎన్ఏ లో  లేదని,  బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ, మా డిక్షనరీలో కూడా భయం అనేది లేదని అన్నారు. కేవలం 37  రోజుల్లో ఎమ్మెల్యే గా విజయం సాధించానని గొప్ప గొప్ప మాటలాడుతున్నారని, చాలామందిని మోసం చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో  మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందే పట్నం మహేందర్ రెడ్డి సహకారంతోనే అని, అలాంటి మహేందర్రెడ్డి నే ప్రస్తుతం నానా  మాటలు అంటున్నారని మండిపడ్డారు.  పట్నం మహేందర్ రెడ్డి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా గెలిచి ఆయననే పక్కన పెట్టారని అన్నారు. అటు మహేందర్ రెడ్డిని ఇటు తాండూరు ప్రజలను  6 గ్యారంటీలో 420 హామీలతో  ఎమ్మెల్యే మోసం చేశారని రాజు గౌడ్ అన్నారు. మనోహర్ రెడ్డి గెలుపుకు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు కోవర్టు లే కారణమని,ప్రస్తుతం  బిఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో వెళ్లిన కొందరు ప్రధాన నాయకులే రోహిత్ రెడ్డి అపజయానికి కారణం అని అన్నారు. మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్,  కరణం పురుషోత్తం రావు,  అబ్దుల్ రావుఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, అజయ్ ప్రసాద్,  బషీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాము నాయక్, మంబాపూర్ నారాయణరెడ్డి, స్వప్న పరిమల్ గుప్తా,  మాజీ డిపిసి సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల బాల్రెడ్డి, నీరజ బాల్రెడ్డి, కొందరు బిఆర్ఎస్ కౌన్సిలర్లు మనోహర్ రెడ్డిని కేవలం 6000 మెజార్టీతో గెలిపించారని, కేవలం తమ తప్పిదం వల్లే ఇలా జరిగిందని  అన్నారు. తమ వెంట ఉన్న కొందరు నాయకుల వల్లనే రోహిత్ రెడ్డి ఓడిపోయారని అన్నారు.  బిఆర్ఎస్  పార్టీని వెన్నుపోటు పొడిచి మనోహర్ రెడ్డిని గెలిపించిన వ్యక్తి ప్రస్తుతం మీ వెనకాలే ఉన్నారని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు డిసిసిబి చైర్మన్గా నియమించింది  నాటి నాయకులు పట్నం మహేందర్ రెడ్డి,కొప్పుల మహేశ్వర్ రెడ్డి,  రోహిత్ రెడ్డి సహాయ సహకారాలతోని నీవు డిసిసిబి చైర్మన్ అయిన విషయాన్ని మరిచిపోయావా?  అని రాజు గౌడ్ అన్నారు.  ఇదివరకు నీకు అన్ని సహాయ సహకారాలు అందించిన  వారిని అందరినీ మోసం చేశావని అది నీ స్వభావం అని అన్నారు. 2029 లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి ఘన విజయం సాధించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, రుద్రూ పటేల్ తదితరులు పాల్గొన్నారు.