September 19, 2026

చంద్రవంచలో చేతికొచ్చిన జొన్న పంట అగ్నికి ఆహుతి …. రైతుకు తీవ్ర నష్టం

WhatsApp Image 2026-03-03 at 6.35.08 PM

చంద్రవంచ గ్రామంలో ఓ రైతు పొలం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించడంతో  చేతికొచ్చిన జొన్న పంట మొత్తం కాలిపోయి బూడిదయింది.  మంగళవారం తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో రైతు కురువ మల్లేశం  భూమిని  కౌలుకు తీసుకొని 10 ఎకరాలలో జొన్న పంటను పండిస్తున్నారు.  మంటల్లో  సుమారు ఆరు ఎకరాలపైగా జొన్న పంట  అగ్నికి అంటుకోవడంతో  మూడు లక్షల పైగా  నష్టం జరిగిందని  రైతు కురువ మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు.  అప్పటికే  తాండూరు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం  అందించిన  ఫలితం లేకుండా పోయింది.ఫైర్ ఇంజన్  అక్కడికి చేరుకునే లోపే  జొన్న పంట మొత్తం అంటుకపోవడంతో రైతుకు జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది.  తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు మల్లేశం మరియు తదితరులు కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొందరు రైతులు తమ పొలాల వరాలపై ఉన్న ముళ్లకంచెలను, గడ్డిని కాల్చడంతో పక్కనున్న పొలంలో మంటలు  చెలరేగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పక్క పొలంలో  చేతికొచ్చిన పంట ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరారు.