September 19, 2026

చంద్ర గ్రహణం సందర్భంగా పలు దేవాలయాల మూసివేత

WhatsApp Image 2026-03-04 at 12.03.42 AM

చంద్రగ్రహణం సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు దేవాలయాలను మూసివేశారు.   మంగళవారం  చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే  బుధవారం ఉదయం నుండి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు.   చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.12   గంటలకు ప్రారంభమై రాత్రి 7.52  వరకు ఉంది.  తాండూరు పట్టణంలోని శ్రీ బావిగీ భద్రేశ్వర దేవాలయం,  శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవాలయం,  మరి చెట్టు కూడలిలోని రక్త మైసమ్మ అమ్మవారి దేవాలయం,  కట్ట మైసమ్మ, స్టేషన్ హనుమాన్ దేవాలయం తదితర దేవాలయాలను మూసివేశారు.