November 4, 2026

నారాయణపూర్ మంతటి లింకు రోడ్డు పనులు ప్రారంభం… సంతోషం వ్యక్తం చేసిన ఇరు గ్రామాల ప్రజలు

IMG_20260312_112433223

నారాయణపూర్ మంతటి రోడ్డు పనులు  ప్రారంభమయ్యాయి.   గురువారం తాండూరు మండలం  నారాయణపూర్ గ్రామం నుండి బషీరాబాద్ మండలం మంతటి గ్రామం మధ్యలో ఉన్న లింకు రోడ్డు  పనుల కోసం  రూపాయలు రెండు కోట్ల యాభై లక్షల నిధులతో  రోడ్డు పనులను ప్రారంభించారు.   ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామ సర్పంచ్ అమృతమ్మ లింకు రోడ్డు పనులను పరిశీలించారు.  మంతటి మరియు నారాయణపూర్ గ్రామ పెద్దలు జెసిబికి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారని ఆయనకు ఎంతో రుణపడి ఉన్నామని  నారాయణపూర్,  మంతటి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.  రెండు గ్రామాల మధ్య దూరం తగ్గిపోయిందని ఇదివరకు ఈ   రెండు గ్రామాల మధ్య 18 km  పైగా దూరం ఉండేదని అన్నారు.  ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నారాయణ పూర్  మంతటి  గ్రామ   సర్పంచులతోపాటు ఆయా గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు సురేష్,రాజు, అనంతరెడ్డి, ప్రభాకర్,శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.