ప్రారంభమైన హనుమాన్ అర్ధమండల దీక్షలు
తాండూరు పట్టణంలో హనుమాన్ దీక్షా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ అర్థ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం తాండూరు పట్టణంలోని కన్నె పాఠశాల దగ్గర గల హనుమాన్ దేవాలయంలో అర్ధమండల దీక్షలు ప్రారంభమయ్యాయి. అర్ధమండల దీక్షలో తాండూరులో 8 మంది యువకులు, బషీరాబాద్ మండలంలో 9 మంది యువకులు అర్ధమండల దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష సమితి సభ్యులు వినోద్ కుమార్ మాట్లాడుతూ హనుమంతుని మండల దీక్షలో అర్ధమండల దీక్షలు తీసుకోవడం ద్వారా స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుందని, దీక్షలు స్వీకరించిన వారు నియమనిష్టలను పాటించాలని కోరారు. దీక్షల అనంతరం శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో వెలసిన పబ్బతి పబ్బతి ఆంజనేయస్వామి, మద్దిమడుగు హనుమాన్ క్షేత్రం దర్శించి ఇరుముడితో దీక్షను విరమింపజేయవలసి ఉంటుందని తెలిపారు.
