May 15, 2026

ఆత్మీయ భరోసా కు …భరోసా కల్పించండి…. ఉపాధి హామీ కూలీల డిమాండ్

WhatsApp Image 2026-03-12 at 2.28.48 PM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని,  ఆత్మీయ భరోసా పేరిట ప్రతి సంవత్సరం ఉపాధి కూలీలకు12000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు.  యాలాల మండలం ఎన్కెపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటపై ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు.  ఉపాధి హామీ కూలీలకు ఆత్మీయ భరోసా పథకం ద్వారా 1100 మందికి 6 వేల రూపాయల చొప్పున ఇదివరకు మంజూరు చేశారని, ఇందులో కూడా కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం వల్ల 100 మందికి నిధులు ఇవ్వలేకపోయారని అన్నారు. ఇకనైనా అందరికీ ఆత్మీయ భరోసా నిధులు మంజూరు చేయాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు.