May 15, 2026

కోటాను గెలిపిద్దాం…. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి పాటుపడదాం….. మాజీ అధ్యక్షులు కటకం వీరేందర్

WhatsApp Image 2026-03-12 at 9.23.11 PM

కోటా మురళీకృష్ణ గెలిపించి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారి కటకం వీరేందర్ అన్నారు.  గురువారం తాండూరు పట్టణంలోని సాయిపూర్, తులసి నగర్, ఆదర్శనగర్ తదితర ప్రాంతాలలో మురళీకృష్ణ గెలుపు కోసం కటకం వీరేందర్ ప్రచారం నిర్వహించారు.ఆర్యవైశ్య సంఘం నాయకులు కల్వ రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయనకు ఆయన నివాసంలో  ఆర్యవైశ్య సంఘం నాయకులతో పాటు కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కటకం వీరేందర్ మాట్లాడుతూ  గతంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, సంగం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని, ఆయనను గెలిపిస్తే మన సంఘం మరింత  అభివృద్ధి పడుతుందని, ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కోటా మురళి కృష్ణ కనుక కోటా మురళి కృష్ణతోపాటు ఆయన ప్యానెల్ లో ఉన్న సభ్యులందరినీ భారీ మెజార్టీతో  ఎన్నుకోవడం మన బాధ్యత అని కటకం వీరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కటకం వీరేందర్ తో పాటు భీమ్ శెట్టి అనిల్ కుమార్, యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, హరీష్, నగరేశ్వరం దేవాలయం మాజీ చైర్మన్ కొంచెం మురళి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.