ఎమ్మెల్యే ప్రశ్నలకు అసంబద్ధ సమాధానమిచ్చిన సర్వేయర్…
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భూభారతి సమగ్ర భూ సర్వే పెద్దముల్ మండలంలోని గిర్మాపూర్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్వే జరుగుతున్న రైతు రామ్ రెడ్డి పొలాన్ని సందర్శించారు, రైతుల తో పాటు సర్వేయర్ తో నేరుగా మాట్లాడి సర్వే సమయంలో ఎదురవుతున్న సమస్యలను గురించి అడిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు సర్వేయర్ మహేష్ ను భూభారతి, భూ సర్వే పై కొన్ని విషయాలను అడిగారు. అందుకు సర్వేయర్ మహేష్, పొంతన లేని సమాధానాలు చెప్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రైతులకు పారదర్శకంగా ఎలాంటి భూ సమస్యలు లేకుండా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకే సర్వే సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో సర్వేయర్ చెప్పిన సమాధానాలను చూసి ఎమ్మెల్యే అసంతృప్తితో అక్కడి నుండి వెళ్లిపోయారు.
