July 31, 2026

ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శాలివాహన డిగ్రీ కళాశాల విద్యార్థులు

IMG-20260106-WA0602

ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో శాలివాహన డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఏకంగా తొమ్మిది మంది విద్యార్థులు 9.10 జిపిఏ పైగా సాధించారు. శాలివాహన డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు అంగో నీ బాయ్ సింధు బీఎస్సీ ఎంపీసీలో 9.48, తహసీమ్ బీఎస్సీ బిజెడ్సి 9.34, సౌజన్య బిఎస్సి బిజెడ్సి 9.30, నిహారిక బీఎస్సీ ఎంపీసీ 9.30, గుడెపు స్పూర్తి బీఎస్సీ ఎంపీసీ 9.28, శ్రీరామ్ నాయక్ బీకాం కంప్యూటర్స్ 9.30, శిరీష బీఎస్సీ ఎంపీసీ 9.05, కుర్వ పల్లవి బిఎస్సి బి జెడ్ సి 9.16, దీపిక బిఎస్సి బిజెడ్సిలో 9.12 జిపిఏలు సాధించారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ శరత్ చంద్ర మాట్లాడుతూ తమ విద్యార్థులు వికారాబాద్ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలను సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, శాలివాహన డిగ్రీ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.