June 5, 2026

బెల్కటూరులో కల్వర్టులో పడిపోయిన నాపరాతి ట్రాక్టర్

IMG-20260519-WA0228

తాండూరు మండలం బెల్కటూరు దగ్గర ఉన్న మంగలి వాడుక (కల్వర్టు)లో చాప్టర్ పడిపోయింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓగిపూర్ నుండి నాపరాయి లోడుతో తాండూర్ వైపు వస్తున్న ట్రాక్టర్ కు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ మల్కాపూర్ గణేష్ అ జాగ్రత్తగా అతివేగంగా ట్రాక్టర్ నడిపినందుని సంఘటన చోటు చేసుకుందామని పలువురు అనుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మంగలి వాడుకకు ఇరువైపులా ఉన్న పిల్లర్లు దెబ్బతిన్నాయని, ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.