June 5, 2026

పరిగి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య

venkatesh

తాండూర్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య సాధారణ బదిలీలలో భాగంగా పరిగి మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు.వెంకటయ్య గతంలో 1990 నుంచి 2013 వరకు తాండూర్ మున్సిపాలిటీలో సేవలందించారు. అనంతరం 2021-22 సంవత్సరాల్లో వికారాబాద్ మున్సిపాలిటీలో విధులు నిర్వహించి, 2022లో తిరిగి తాండూర్ మున్సిపాలిటీకి వచ్చి 2026 మే నెల చివరి వారం వరకు తన సేవలను కొనసాగించారు.సాధారణ పరిపాలనా బదిలీలలో భాగంగా ఆయనను పరిగి మున్సిపాలిటీకి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ తాను తాండూర్ మున్సిపాలిటీలో పనిచేసిన కాలంలో సహకారం అందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తన విధుల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పరిగి మున్సిపాలిటీలో కూడా అదే అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తానని వెంకటయ్య పేర్కొన్నారు.