September 18, 2026

యాలాలలో కూలిన ఇల్లు…. తప్పిన ప్రమాదం…. ఆదుకోవాలని కోరిన కుటుంబీకులు

యాలలలో ప్రమాదవశాత్తు ఓ ఇల్లు కూలిపోయింది. మంగళవారం యాలాల మండల కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో ఓ ఇల్లు కూలిపోయింది. ఇంటి యజమాని సక్కుబాయి తెలిపిన వివరాల ప్రకారం తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న మంగళి ఆంజనేయులు ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో లేనందున ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. వర్షాకాలంలో తడిసి ముద్దైన ఇల్లు ప్రస్తుతం కూలిపోయిందని తమకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ఇంటి యజమాని సక్కుబాయి కోరారు.