తాండూర్ మున్సిపల్ లో బిజెపి అభ్యర్థులనే గెలిపించండి…. బిజెపి నాయకులు ఇందర్ రాములు
తాండూర్ మున్సిపల్ లో బిజెపి పార్టీకి ఓటు వేసి బిజెపి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బిజెపి నాయకులు ఇందూరు రాములు కోరారు. మంగళవారం ఇందూర్ రాములు మాట్లాడుతూ తాండూర్ పట్టణంలో 30 వార్డులలో బిజెపి అభ్యర్థులు బరిలో ఉన్నారని వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తాండూరు పట్టణ అభివృద్ధి కోసం బిజెపి పార్టీలను గెలిపించాలని కోరారు. 36 వార్డుల అభివృద్ధి కోసం తాండూరు నియోజకవర్గం లోని 136 గ్రామాల బిజెపి కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలని కోరారు. తాండూరు పట్టణంలోని 11 వార్డులో ఉన్న సమస్యలను అన్నింటినీ తీరుస్తానని అందుకు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని రాములు కోరారు. గత మూడు రోజులుగా ఆదర్శనగర్ పాతకుంట ప్రాంతంలో ఎన్నో రోజులుగా తిష్ట వేసిన సమస్యలను తన సొంత డబ్బులతో జెసిబి యంత్రంతో అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సహాయ సహకారులతో తాండూరిని అభివృద్ధి చేద్దామని అందుకు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
