విద్యుత్ షాక్ తో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
విద్యుత్ షాక్ తో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన యాలాల మండలం కోకట్ గ్రామంలో చోటు చేసుకుంది. కోకట్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ (45) యాలల మండలం రాస్నం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హిందీ పండితుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం కోకట్ గ్రామంలో తన ఇంట్లో ఉన్న పిండి గిండ్రికి మరమత్తులు చేస్తుండగా విద్యుత్ శాఖ గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
