September 18, 2026

16వ వార్డులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం.. శ్రీలత శ్రీకాంత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎండీ రియాజ్

IMG-20260208-WA0007

తాండూరు, ఫిబ్రవరి 08: తాండూరు మున్సిపల్ ఎన్నికల సమరం వేడెక్కుతోంది. ఇందులో భాగంగా 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నారా శ్రీలత శ్రీకాంత్ విజయాన్ని కాంక్షిస్తూ వార్డు ఇన్చార్జి, టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండీ రియాజ్ ఆదివారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించి, హస్తం గుర్తుకు ఓటు వేసి శ్రీలతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎండీ రియాజ్ మాట్లాడుతూ.. తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే, ఎమ్మెల్యే సహకారంతో వార్డుకు అత్యధిక నిధులు మంజూరు చేయించి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు తెలిసిన అభ్యర్థిగా శ్రీలత శ్రీకాంత్‌కు అండగా నిలవాలని ఆయన వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారా అశోక్, ఎం. నర్సింలు, ఖాయుమ్, అజ్జు, రాము, రాజు, చంద్రశేఖర్, గడ్డామిది శివకుమార్ తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.