కాంగ్రెస్‌తోనే తాండూరు అభివృద్ధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాయిపూర్‌లో ఘనంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్.. పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సాయిపూర్‌లో ఉధృతంగా ప్రచారం నిర్వహించాయి. ఆదివారం రాత్రి సాయిపూర్ పరిధిలోని 7, 9, 10, 11, 12 మరియు 28వ వార్డుల కాంగ్రెస్ అభ్యర్థుల విజయార్థం ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, నిరంతర అభివృద్ధికి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ‘చేయి’ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాన్వాయ్‌లు, నాయకుల అండతో కాకుండా సామాన్య ప్రజల పక్షాన నిలిచే అభ్యర్థులను కాంగ్రెస్ రంగంలోకి దింపిందని, సాయిపూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
