డివిజన్ స్థాయి సీఎం కప్ 2026 కరాటే క్రీడల్లో సత్తా చాటిన మాస్టర్ జపాన్ చోటే ఖాన్ క్రీడాకారులు
గ్రామీణ యువత క్రీడల్లో ప్రోత్సహించే విధంగా కొనసాగుతున్న సీఎం కప్ 2026 లో కరాటే క్రీడల్లో మాస్టర్ జపాన్ చోటే ఖాన్ క్రీడాకారులు తమ సత్తా చాటారు. యాలాల్ మండల పరిధిలోని గౌతమి మాడల్ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ 2026 డివిజన్ స్థాయిలో కొనసాగుతున్న క్రీడల్లో మాస్టర్ జపాన్ చోటే ఖాన్ కరాటే క్రీడాకారులు 14 మంది పాల్గొన్నారు పాల్గొన్నారు. పాల్గొన్న 14 మంది మాస్టర్ జపాన్ చోటే క్రీడాకారుల్లో ఐదుగురు క్రీడాకారులు బంగారుపథకాలు, నలుగురు క్రీడాకారులు వెండి పథకాలను సాధించారు. హర్షితా బాయ్, అలియా బేగం, రుక్సానా బేగం, వేణు, సాయి ప్రకాష్ బంగారు పథకాలను సాధించగా వంశీ, ఆల్ఫాస్, జోక్స్నా, లక్ష్మి లు సిల్వర్ పథకాలను సాధించారు. ఈ సందర్భంగా సీనియర్ కరాటే మాస్టర్ సాయికుమార్ తమ కరాటే క్రీడాకారులు ఐదుగురు బంగారు పథకాలను నలుగురు సిల్వర్ పథకాలను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ స్థాయిలో ఉన్న యువకులు క్రీడల్లో రాణించాలనే ముఖ్య ఉద్దేశంతోనే సీఎం కప్ 2026 ప్రారంభించారని తెలిపారు. కరాటే క్రీడలతో పాటు, వాలీబాల్, కబడ్డీ, తదితర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్, తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉదయభాస్కర్ రెడ్డి, గౌతమి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
