July 31, 2026

మున్సిపల్ కౌంటింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ …… కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

మున్సిపల్  ఎన్నికలలో భాగంగా  తాండూరు పట్టణంలోని 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం  13వ తేదీ  శుక్రవారం  ఉదయం  వెలువడనుంది.  తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.   శుక్రవారం ఉదయం  7 గంటల నుండి ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది.   అధికారులు నాలుగు విడతలుగా పోలింగ్   ఫలితాలను వెల్లడించారు.  మూడు రౌండ్లలో మొత్తం ఫలితాలు  వెలువడనున్నాయి.  మొదటి రౌండ్లో 1,4,7,10,13,16 ,19,22,25,28,31,34 వార్డ్ ల ఫలితాలు వెలువడనున్నాయి.  రెండవ రౌండ్లో 2,5,8,11,14,17,20,23,26,29,32,36 వార్డ్ ల ఫలితాలు వెలువడగా  మూడవ రౌండ్ లో 3,6,9,12,15,18,21, 24,27,30,33 వార్డ్ ల ఫలితాలు వెలువడతాయి. శుక్రవారం ఉదయం నిర్వహించే  ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో అనుసరించవలసిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు,  టేబుల్ వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయుట, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై అధికారులు చర్చించారు.

ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి ఫలితాలను సమగ్రంగా నమోదు చేసి, సంబంధిత అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, ఆ తర్వాత పరిశీలకుల అనుమతితో విజేతలను  ప్రకటించాలని  ఎన్నికల అధికారులు నిర్ణయించారు.  కౌంటింగ్ సిబ్బంది ఉదయం 7 గంటల లోపే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని పై అధికారులు సూచించారు.  సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.  అనుమతి పొందిన వ్యక్తులకు మాత్రమే అక్కడికి ప్రవేశం కల్పించబడుతుందని  ఎన్నికల అధికారులు సూచించారు.  ఓట్లను లెక్కించే సిబ్బంది సమయానికి లెక్కింపు కేంద్రాలకు హాజరై తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.