July 31, 2026

రాజీవ్ స్వగృహ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర బోర్వెల్ వేయించిన పటేల్ రవిశంకర్

తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహ సమీపంలోని వెంకటేశ్వర స్వామి గుట్ట లో వెలసిన వెంకటేశ్వరుని దేవాలయం దగ్గర బిజెపి నాయకులు పటేల్ రవిశంకర్ బోర్వెవెల్ వేయించారు. ఈ సందర్భంగా దేవాలయం నిర్వాహకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు బిచ్చప్ప,మల్లికార్జున్, పటేల్ విజయ్ కుమార్, ఆంజనేయులు, కృష్ణయ్య, శివారెడ్డి, చల్లా నర్సిములు, చల్లా నగేశ్,,గోదల ప్రతాప్ రెడ్డి  తదితరులు పటేల్ రవిశంకర్ కు కృతజ్ఞతలు  తెలిపారు. బోర్వెల్ కోసం పటేల్ రవిశంకర్ సుమారు 60 వేల రూపాయలను వెచ్చించారని, అదేవిధంగా భక్తుల దాహాన్ని తీర్చే విధంగా జిపిఆర్ గోదాల ప్రతాపరెడ్డి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సహాయం అందించాలని  దేవాలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల కోరికలు నెరవేర్చే స్వామి వారి  దేవాలయానికి భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించడం  కోసం మరిన్ని  సహాయ సహకారాలు అందించాలని పలువురు కోరుతున్నారు.