బస్సు సౌకర్యం లేక మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుల ధర్నా
మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు తాండూర్ బస్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించి తమ గమ్యస్థానాలకు తిరుగు ఉపాధ్యాయులు ప్రయాణం చేశారు. అప్పటికే చీకటి కావడంతో బస్సులు సమయానికి రాలేకపోయాయి. విధులు నిర్వహించిన అనంతరం వారికి చెల్లించవలసిన రెమినేషన్ మున్సిపల్ అధికారులు సమయానికి చెల్లించలేకపోయారు. దీంతో సమయానికి బస్సులు రాకపోవడంతో కనీసం మంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఆగ్రహంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న తమ పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మార్వో తారా సింగ్ నాయక్ తాండూర్ సీఐ సంతోష్ కుమార్ అక్కడికి చేరుకొని తాండూర్ బస్ డిపో డిఎం సురేష్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో ఉపాధ్యాయులు తాము నిర్వహిస్తున్న ధర్నాను విరమించారు.
