ఘనంగా కాంగ్రెస్ నాయకుడు ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు
తాండూరు మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పరి స్వరూప భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు గురువారం రోజు ప్రజల మధ్య ఘనంగా నిర్వహించారు. మదీనా గల్లీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప్పరి మల్లేశం చే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పరి మల్లేశం ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు. ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకల్లో మైనార్టీ నాయకులు రియాజ్, కోర్వర్ నాగేష్‌లతో పాటు మదీనా గల్లీ వాసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు, స్నేహితులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
