September 19, 2026

రేపు గర్జించనున్న పెద్దేముల్: శివాజీ జయంతికి సర్వం సిద్ధం! శవాజీ నగర్‌లో ధర్మ రక్షకుడి వేడుకలు: తరలిరావాలని రాఘవేందర్ రెడ్డి పిలుపు

– పెద్దేముల్‌లో ఘనంగా శివాజీ జయంతి ఉత్సవాలు
– యువజన సంఘం అధ్యక్షుడు బంగ్లా రాఘవేందర్ రెడ్డి పిలుపు
– గర్జించనున్న పెద్దేముల్: శివాజీ జయంతికి సర్వం సిద్ధం!
– శవాజీ నగర్‌లో ధర్మ రక్షకుడి వేడుకలు: తరలిరావాలని రాఘవేందర్ రెడ్డి పిలుపు!

సంకల్పం ప్రతినిధి పెద్దేముల్, (ఫిబ్రవరి 18:) మండల కేంద్రంలోని శివాజీ నగర్‌లో రేపు (గురువారం) ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఛత్రపతి శివాజీ యువజన సంఘం అధ్యక్షుడు బంగ్లా రాఘవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు శివాజీ నగర్‌లో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అనంతరం సాయంత్రం 5 గంటలకు గ్రామంలో శివాజీ మహరాజ్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు పెద్దేముల్ గ్రామ యువత, గ్రామ పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మరియు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. శివాజీ మహరాజ్ ఆశయాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాఘవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
(పెద్దేముల్ మండలంలోని వార్తలకు 9640964209 కి సంప్రదించండి)