September 18, 2026

ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల టిపిఎల్ క్రికెట్ పోటీలు…ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు

తాండూర్ నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి.  ఆదివారం తాండూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే  గురుకుల పాఠశాల మైదానంలో టీచర్స్ ప్రీమియర్ లీగ్ టిపిఎల్ పోటీలు ప్రారంభమయ్యాయి.  ఈ పోటీలలో తాండూరు నియోజకవర్గం లోని బషీరాబాద్ మండలం, పెద్దేమోల్ మండలం, యాలాల్ మండలం, తాండూరు  మండలాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉత్సాహంగా  క్రికెట్ పోటీలలో పాల్గొన్నారు.  ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు క్రీడల వల్ల వ్యక్తి జీవితంలో ఆరోగ్యం మెరుగుపరచుకోవడంతోపాటు ఉత్సాహంగా పాల్గొనే విధంగా ఉండేందుకు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.  ఈ క్రికెట్ పోటీలలో ఐకాన్ టీం  బషీరాబాద్ మండల్ నిర్వాహకులు ఈశ్వర్ గౌడ్,   జోషి విజయకుమార్,  రవికాంత్, మొగులప్ప, శివప్రసాద్, వీరేశం, పి ఆర్ టి యు బషీరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి రవి, సీనియర్ ఉపాధ్యాయులు నాగరాజు, మధుసూదన్ గౌడ్, శ్రీనివాస్, సుభాష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సెలవు దినాలలోనే క్రికెట్  క్రీడలలో పాల్గొంటున్నామని నేడు జరిగిన క్రికెట్ పోటీలలో  తాండూరు మండల  ఉపాధ్యాయులు గెలుపొందారని వారికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందించామని ఐకాన్ టీం నిర్వాహకులు ఈశ్వర్ గౌడ్ తెలిపారు.  సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ వచ్చేనెల మార్చి 1వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.