July 30, 2026

బషీరాబాద్ లో హుబ్లీ ట్రైన్ నిలుపుదల సంతోషకరం… ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

IMG-20260227-WA0237

బషీరాబాద్ మండల పరిధిలోని నవంద్గి రైల్వే స్టేషన్ లో హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నేటి నుండి నిలవడం పట్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నవంద్గి రైల్వే స్టేషన్ నుండి తాండూరు వరకు హుబ్లీ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేశారు. నవంద్గి రైల్వే స్టేషన్లో హుబ్లీ ఎక్స్ప్రెస్ కు స్థానిక నాయకులు, ప్రయాణికులు రైలును అలంకరించి సంతోషం వ్యక్తం చేశారు. తాండూర్ రైల్వే స్టేషన్ లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నుండి దిగి కాసేపు విలేకరులతో మాట్లాడారు. అనంతరం హుబ్లీ ట్రైన్ లో  హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హుబ్లీ ఎక్స్ప్రెస్ నవంద్గి స్టేషన్లో ఆపడం కుదరదని రైల్వే అధికారులు చెప్పారని అయినా తమ సుదీర్ఘ పోరాటం వల్ల సాధ్యమైందని తాండూరు రైల్వే స్టేషన్ కు కేవలం 20 కిలోమీటర్లు ఉందని నవంద్గి స్టేషన్లో ఆపడం కుదరదు అన్న రైల్వే మినిస్టర్ను, రైల్వే అధికారులను అడిగి ఆపేలా చూసామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా సంతోషమైన విషయమని గత కొన్ని సంవత్సరాలుగా బషీరాబాద్ ప్రాంత నాయకులు వ్యాపారవేత్తలు ప్రముఖుల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతంగా కర్ణాటక సరిహద్దుకు అనుకొని ఉన్న బషీరాబాద్ మండల ప్రజలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నవంద్గిలో నిలపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. బషీరాబాద్ నుండి తాండూరు ఎంపీ ఎమ్మెల్యే తో పాటు యాలాల్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, అజయ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్, నవంద్గీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రాకేష్ మహారాజ్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. తాండూర్ రైల్వే స్టేషన్ లో బిజెపి తాండూర్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, అంతరం కిరణ్, మాజీ కౌన్సిలర్ అంతరం లలిత, కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్, బొప్పి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.