తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బాధ్యతలు చేపట్టిన పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి
తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో చైర్ పర్సన్ గా నీరజ బాల్‌రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై చైర్మన్ నీరజాబాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులను మరియు వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ లను ఘనంగా సన్మానించారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, బిజెపి కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన నీరజాబాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల అనంతరం అందరం కలిసి అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. తాండూర్ పట్టణంలోని 36 వార్డుల అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఎమ్మెల్యే అన్నారు. తాండూరు ప్రజలకు కాగ్న నది నుండి నీటిని తీసుకువచ్చి ప్రజలకు త్రాగు నీటి సమస్య లేకుండా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో అత్యధిక నిధులు తెచ్చి తాండూరు రూపు రేఖలు మారుస్తానని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే 2028 సంవత్సరానికి తాండూర్ పురపాలక సంఘం ఏర్పడి 75 వసంతాలు పూర్తిచేసుకున్నదని అందుకు విజన్ 28 పేరుతో తాండూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత పాలకుల కారణంగా గతంలో ఉన్న మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. తాను మున్సిపల్ ఎన్నికలను తాను గత రెండు సంవత్సరాలుగా చేసిన రెఫరండంగా భావించానని సాయిపూరు కార్నర్ మీటింగ్‌లో ఈ విషయాన్ని తెలిపానని అందుకే చాలెంజ్‌గా తీసుకొని మునిసిపల్ ఎన్నికల్లో హంగు ఏర్పడకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ లకు మున్సిపల్ లో ఎంతో అనుభవం ఉందని మున్సిపల్‌ను వారు అభివృద్ధి చేసి చూపిస్తారని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేరును వాడకుండానే ఘాటుగా విమర్శించారు. బషీరాబాద్ మండలం తన సొంత మండలంలోని ఓ బాల్ బచ్చన్ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని, తాను ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన అనంతరం మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచాలని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన కేవలం కాగితాలకే పరిమితమయ్యారని అన్ని బోగస్ మాటలు మాట్లాడారని అన్నారు. తన సొంత పనులకు కరోనా అడ్డం రాలేదని తాండూర్ అభివృద్ధికి మాత్రం కరోనా అడ్డం వచ్చిందా అంటూ మాజీ ఎమ్మెల్యే పై ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో లక్ష మెజారిటీ అవుతావు గెలుస్తానని మాజీ ఎమ్మెల్యే పెద్దపెద్ద మాటలు ఆడారని అన్నారు. ఎన్నికలలో కార్యకర్తలు నీకోసం నీ గెలుపు కోసం కృషి చేశారని కానీ వారికోసం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎందుకు కృషి చేయలేదో అది ఆయన తెలివి అంటూ విరుచుకుపడ్డారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇప్పటికీ సినిమా చూపించానని టీజర్ చూపిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఎన్ని కలవరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధి కోసం పాటుపడాలని, తాండూర్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సహాయంతో ఎన్ని నిధులైన తెచ్చి అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో తాండూర్ అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో పాటు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిలర్లు భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, బిజెపి కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు కాగా బిఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కాలేకపోయారు.
