September 18, 2026

SIR ప్రక్రియను విజయవంతం చేయండి…. తాండూరు ఆర్డీఓ అనిత

RDO ANITHA

చాలామంది ఓటర్లు SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారాలను ఎలా నింపాలో తెలియక, సందేహాలతో పాటు ఇంకా గడువు ఉందనే భావనతో ఇంట్లోనే ఉంచుకుంటున్నారని తాండూర్ ఆర్డీవో అనిత తెలిపారు. అలాంటి ఓటర్లకు సహాయం చేసేందుకు ప్రత్యేక SIR హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, ఫారాలు నింపడం రాని వారికి BLOలు హెల్ప్ డెస్క్‌లలో పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కువ మంది ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని SIR పత్రాలను సంబంధిత BLOలకు అందజేయాలని సూచించారు. SIR ప్రక్రియ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఓటరు తమ ఫారాలను జూలై 14వ తేదీలోపు సమర్పించాలని ఆర్డీవో అనిత విజ్ఞప్తి చేశారు. గడువు ఉందనే కారణంతో ఆలస్యం చేయడం సరైంది కాదని, ప్రతి ఓటరు బాధ్యతగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. జూలై 14 తర్వాత ASD (Absent, Shifted, Dead) జాబితా తయారీతో పాటు రేషనలైజేషన్ (Rationalisation) ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఆన్‌లైన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఓటరు 14వ తేదీలోపు తమ SIR పత్రాలను BLOలకు అందజేసి ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆర్డీవో అనిత పిలుపునిచ్చారు.