May 15, 2026

జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఆర్షియా ఖాన్

IMG-20260204-WA0900(1)

జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఆర్షియా ఖాన్ ను నియమించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ చేతులమీదుగా ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అర్షియా ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో పాల్గొనేందుకు ధనవంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమించినందున ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకన్న గౌడ్, సాయప్ప, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు