July 30, 2026
–  సంగమేశ్వర ఆలయంలో డాక్ట‌ర్ పట్లోళ్ల నర్సింహులు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు

సంకల్పం బషీరాబాద్, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తాండూర్ నియోజకవర్గంలోనీ  బషీరాబాద్ మండలంలోని నవంద్గీ కూడలిలోని సంఘం సంగమేశ్వర దేవాలయంలో వేడుకలు కనులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ పట్లోళ్ల నర్సింహులు-సురేఖ దంపతులు, తండ్రి రాములుతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, కల్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శివనామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నర్సింహులు మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం శివపార్వతుల కల్యాణం, అభిషేకం, అన్నదానం వంటి కార్యక్రమాలను భక్తి భావంతో నిర్వహించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

– గోపాల్ ప్రతినిధి బషీరాబాద్ మండలం