July 31, 2026

ఆసరా పింఛన్ల పై చేతులెత్తేసిన చేయి సర్కారు…..యాలాల మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

WhatsApp Image 2026-03-11 at 4.18.00 PM

(సంకల్పం యాలాల ప్రతినిధి )  ఆసరా పింఛన్ల  విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని యాలాల మండల  బిఆర్ఎస్  మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి విమర్శించారు.  బుధవారం యాలల మండల కేంద్రంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బీదల కోసం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకం విషయంలో చేయి ప్రభుత్వం చేతులెత్తేసిందని,  కొత్త పెన్షన్లు మంజూరు చేయలేకపోయారని,  అర్హులైన వృద్ధులు వితంతులు వికలాంగులు తీవ్ర ఆందోళన గురవుతున్నారని  రవీందర్ రెడ్డి అన్నారు.  ఎన్నికల సమయంలో 2000 పెన్షన్లు 4000కు 4000 పెన్షన్లు 6000 వరకు పెంచుతామని మొండి చేయి చూపించారని అన్నారు.  కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు చాలా రోజుల నుండి పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు నిరాశకు  గురవుతున్నారని అన్నారు.  ఇదివరకు చాలాసార్లు  ప్రజాపాలనా కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి  దరఖాస్తులను స్వీకరించారని  కానీ వారికి మొండి చేయి చూపించారని అన్నారు.  గ్రామాలలో పట్టణాలలో చాలామంది అర్హులైనప్పటికీ పింఛన్లను మంజూరు చేయలేకపోవడం పట్ల  ప్రభుత్వం పై రవీందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని రవీందర్ రెడ్డి హెచ్చరించారు.